అంతరిక్ష రంగంలో భారత్ వరుసగా అద్భుత విజయాలు అందుకుంది.ఈ మేరకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఓ కీలక ప్రకటన చేశారు.2035 ఏడాదికి భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉంటుందని తెలిపారు.2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడుతాడని చెప్పారు.ఇప్పటికే అమెరికా, రష్యా, జపాన్, కెనాడా, యూరప్ దేశాలు కలిసి ఓ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాయి.అలాగే చైనా కూడా సొంతగా స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.2035లో నాటికి ఇక భారత్‌కు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉన్న దేశంగా నిలవనుంది.
అంతరిక్ష పరిశోధనలు మెరుగుపరిచేందుకు అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్ స్పేస్ స్టేషన్ తొలి మాడ్యూల్ 2028లో ఎల్‌వీఎం 3 వాహకనౌక ద్వారా ప్రారంభించనట్లు తెలుస్తుంది.నాలుగేళ్ల తర్వాత స్పేస్ స్టేషన్ తయారుకానుంది.అందులోని మాడ్యుల్స్‌ని వివిధ దశల్లో నింగిలోకి పంపిస్తారు.ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని లింక్ చేస్తారు.మొత్తానికి 2035 నాటికి స్పేస్ స్టేషన్ పూర్తవుతుంది.ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు.