నట దిగ్గజం, మాజీ సీఎం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగపురుషుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహాపురుషుడు ఎన్టీఆర్ శతజయంతిని గత ఏడాది జరుపుకున్నాం. ఏడాది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉత్సవాలు జరిపి ఆయనకు ఘన నివాళి అర్పించాం. ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న ఈ సినీ వజ్రోత్సవ వేడుక అపూర్వ ఘట్టం. ఎన్టీఆర్ తొలిసారి నటించిన ‘మనదేశం’ చిత్రం విడుదలైన 75 ఏళ్లు కాగా ఎన్టీఆర్ మొదటి సినిమా హీరోయిన్ కృష్ణవేణి. 102 సంవత్సరాల వయసులోనూ ఈ వేడుకకు ఆమె హాజరుకావడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. కారణజన్ముల చరిత్ర మనం గుర్తు చేసుకోని స్పూర్తి పొందాలని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్పూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 కల సాకారం చేసుకుందాం. ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేవరకు వదిలిపెట్టం.. ఖచ్చితంగా సాధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు