దేశానికి కాంగ్రెస్ అనేక విధాలుగా నష్టం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు.దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేక నష్టాలు కలిగించిందంటూ పార్లమెంటు ప్రసంగంలో ప్రధాని మోదీ విమర్శించారు.’రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ యత్నించింది. రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు ప్రయత్నించింది.55 ఏళ్ల పాటు దేశాన్ని ఒకే కుటుంబం పాలించింది.1947 నుండి 1952 వరకూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగలేదు’ అని గుర్తుచేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.’బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు.ఐక్యతను దెబ్బతీసేందుకు విషబీజాలను నాటారు.సుప్రీంకోర్టు అధికారాలు తగ్గించేందుకు నాటి ప్రధాని ఇందిర ప్రయత్నించారు.ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కుల్ని హరించారు.వేలాదిమందిని జైళ్లకు తరలించారు. కోర్టులు,పత్రికల గొంతు నొక్కారు’ అని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నించిందని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు ప్రసంగంలో మండిపడ్డారు.’రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు నాటి ప్రధాని నెహ్రూ అనేకసార్లు ప్రయత్నించారు.రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు.తప్పు చేస్తున్నారంటూ బాబూ రాజేంద్రప్రసాద్ ఆయన్ను హెచ్చరించారు. ఎంతోమంది పెద్దలు సైతం సలహా ఇచ్చినా నెహ్రూ పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రధాని పార్లమెంటులో అన్నారు.‘75 ఏళ్ల ప్రజాస్వామ్య వేడుక చేసుకునే ఆనంద క్షణాలివి. ప్రజాస్వామ్యా లన్నింటికీ భారత్ తల్లివంటిది.రాజ్యాంగ నిర్మాతలతో పాటు ప్రజలకు నా ధన్య వాదాలు.రాజ్యాంగంలో మహిళలది కీలక పాత్ర.వారిని గౌరవిస్తూ మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టామను పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.