పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమర యోధుడు, మానవతావాది పొట్టి శ్రీరాములు త్యాగం మన తరతరాలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని.. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు. త్వరలో ఏపీలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టామన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టిందని విమర్శించారు. అమరావతి, పోలవరాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆనందకరమైన, సంపదతో కూడిన సంతోషకర సమాజమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: రెండో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా:405-7
Next Article చిరంజీవి నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్…!