తన మేనమామ, అగ్ర కథానాయకుడు చిరంజీవి నివాసానికి నటుడు అల్లు అర్జున్ వెళ్లారు.ఈరోజు మధ్యాహ్నం తన భార్యా పిల్లలతో కలిసి ఆయన చిరు నివాసానికి వెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత చిరంజీవి – అల్లు అర్జున్ తొలిసారి కలుసుకోవడంతో ఈ మీట్‌కు ప్రాధాన్యత సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలిసిన వెంటనే చిరంజీవి – సురేఖ దంపతులు బన్నీ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులను పరామర్శించారు.నిన్న ఉదయం బన్నీ బెయిల్‌పై విడుదలై ఇంటికి రాగా.. చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు.
Previous Articleపొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంకురార్పణ: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article అమెరికాలో ఈ నెల 21న “గేమ్ చేంజర్” ఈవెంట్ ..!