ఆస్ట్రేలియాతో సిరీస్ లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత మహిళా క్రికెట్ జట్టు తాజాగా వెస్టిండీస్ తో ప్రారంభమైన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ లో అదరగొట్టి శుభారంభం చేశారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. వెస్టిండీస్ పై భారత్ కు ఇదే అత్యధిక స్కోరు. జెమీమా రోడ్రిగ్స్ 73 (35; 9×4, 2×6), స్మృతి మంథాన 54 (33; 7×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ లతో రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. డాటిన్ 52 (28; 4×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించింది. క్వినా జోసెఫ్ 49 (33; 5×4, 3×6) పోరాటం కనబరిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాధ యాదవ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టి వెస్టిండీస్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు