భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 445 పరుగులు చేసింది. మూడో రోజు 405-7 ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మరో 40 పరుగులు చేసి ఆలౌటయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ పేలవంగా ఆడుతోంది. యశస్వీ జైశ్వాల్ (4), శుభ్ మాన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. కే.ఎల్.రాహుల్ 33 బ్యాటింగ్ రోహిత్ శర్మ 0 నాటౌట్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2 వికెట్లు, పాట్ కమ్మిన్స్, హేజల్ వుడ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. భారత్ ఇంకా ఆస్ట్రేలియా కంటే 394 పరుగుల వెనుకంజలో ఉంది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్:
ఉస్మాన్ ఖవాజా 21 (54; 3×4) (సి) పంత్ (బి) బుమ్రా
నాథన్ మెక్స్వీనే 9 (49;1×4) (సి) కోహ్లీ (బి) బుమ్రా
మార్నస్ లబుషేన్ 12 (55) (సి) కోహ్లీ (బి) నితీష్ రెడ్డి
స్టీవ్ స్మిత్ 101 (190; 12×4) (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా
ట్రావిస్ హెడ్ 152 (160, 18×4 ) (సి) పంత్ (బి) బుమ్రా
మిచెల్ మార్ష్ 5 (16) (సి) కోహ్లీ (బి) బుమ్రా
అలెక్స్ క్యారీ 70 (88; 7×4, 2×6)
పాట్ కమ్మిన్స్ 20 (33;1×4) (సి) పంత్ (బి) సిరాజ్
మిచెల్ స్టార్క్ 18 (30; 1×4, 1×6) (సి) పంత్ (బి) బుమ్రా
లియాన్ 2 (30) (బి) సిరాజ్
హేజల్ వుడ్ 0 నాటౌట్
అదనపు పరుగులు:35
మొత్తం 445-10 (117.1 ఓవర్లు).
భారత బౌలింగ్:
బుమ్రా 56 వికెట్లు,సిరాజ్ 2 వికెట్లు, నితీష్ రెడ్డి 1 వికెట్, ఆకాష్ దీప్ 1 వికెట్.