నటుడు మంచు మనోజ్,ఆయన సతీమణి మౌనిక కలిసి జనసేనలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.మా అత్తయ్యగారి జయంతి సందర్భంగా మొదటిసారి మా కూతురు దేవసేన శోభను ఆళ్లగడ్డ తీసుకొచ్చాం.జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకురాలేదు.మా కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చా.ఊళ్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారు.అందరికీ ధన్యవాదాలు.రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై స్పందిస్తూ తాను ఇప్పుడే ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని చెప్పారు.
Previous Articleఆ వీడియోలు నమ్మవద్దు : ఎస్‌బీఐ అలర్ట్
Next Article సెర్చ్ ఇంజన్ ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

