భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండాన్ని అధిగమించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 51-4 తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన భారత్ ను కే.ఎల్.రాహుల్ 84(139;8×4), రవీంద్ర జడేజా 77 (123; 7×4, 1×6) మంచి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి (16), సిరాజ్ (1) స్వల్ప పరుగులకే అవుటైనా ఆకాష్ దీప్ 27 నాటౌట్ (31, 2×4, 1×6), బుమ్రా 10 నాటౌట్ (1×6)పరుగులతో భారత్ ను ఫాలో ఆన్ నుండి కాపాడారు. మధ్య మధ్యలో వర్షం ఆటంకం కలిగించింది. ఇక ఆస్ట్రేలియా కంటే భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 193 పరుగులు వెనుకంజలో ఉంది. అయితే ఇంకా ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది.
Previous Articleసెర్చ్ ఇంజన్ ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ
Next Article పార్లమెంటు ముందుకు ‘జమిలీ’ ఎన్నికల బిల్లు

