నితిన్ కథానాయకుడిగా , దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్ హుడ్’.ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.తాజాగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.అనుకోని పరిస్థితుల వల్ల దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందంటూ మైత్రీ మూవీస్ పోస్ట్ పెట్టింది.త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పింది.నితిన్ – వెంకీ కుడుముల కలయికలో వస్తోన్న రెండో చిత్రమిది.గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన “బీష్మ” సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Previous Articleఆ కుట్ర వెనుక ఎవరున్నారో నాకు తెలుసు:- రాజ్‌కుంద్రా
Next Article భారీ నష్టాలతో వెలవెల బోయిన సూచీలు