దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు ప్రధాన షేర్లలో అమ్మకాల వలన సూచీలు జోరు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1,064 పాయింట్ల నష్టంతో 82,133 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 332 పాయింట్ల నష్టంతో 24,336 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.91గా ఉంది. ఐటీసీ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleనితిన్ రాబిన్ హుడ్ విడుదల వాయిదా…!
Next Article అడివి శేష్ “డకాయిట్ ” పోస్టర్ విడుదల…!