ఎలక్ట్రానిక్ వెహికల్ మార్కెట్ భారత్ లో 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ పరిశ్రమ వేగంగా ప్రగతి సాధిస్తోందని తెలిపారు. ఆయన నేడు “ఈవీఎక్స్ పో 2024′ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈవీ రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం రూ.22 లక్షల కోట్లు పెట్టిన ఇంధనాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఇది ఆర్థికంగా చాలా సవాలుతో కూడుకున్నదని అందువల్లనే దేశీయంగా హైడ్రో పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారులు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కొరత ఉందని లక్ష బస్సులు అవసరమైతే 50 వేల బస్సులు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగం విస్తరించేందుకు ఇది సరైన సమయమని సంస్థలకు సూచించారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం పెరిగిందని 2014లో రూ.7లక్షల కోట్లు నుండి ఇప్పుడు రూ.22 లక్షల కోట్లతో జపాన్ ను దాటి మూడో స్థానంలో నిలిచిందన్నారు.
ఈవీ రంగం విస్తరణకు ఇదే సరైన సమయం:2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు:కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
By admin1 Min Read
Previous Article80వేల దిగువకు సెన్సెక్స్..24 వేల దిగువకు నిఫ్టీ
Next Article మహిళలు పువ్వులాంటి వాళ్ళు: ఖమేని పోస్ట్