కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం “ఇండియన్ 2”. ఎన్నో అంచనాల మధ్య విడుదల ఆయిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా శంకర్ స్పందించారు. ఆ సినిమాకు అలాంటి నెగెటివ్ రివ్యూస్ ఊహించలేదని అన్నారు. ఇండియన్ 3, గేమ్ చ్చేంజర్ అద్భుతంగా ఉంటాయని ఆయన అన్నారు. గేమ్ చేంజర్ విషయంలో తాను ఎంతో నమ్మకం తో ఉన్నానని తెలిపారు. రామ్ చరణ్ నటన చాలా బాగుందని అన్నారు. ఇండియన్ 3 థియేటర్ లోనే విడుదల చేస్తామని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన గేమ్ చెంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది
Previous Articleఫార్ములా ఈ రేసులో కేసు.. కేటీఆర్ ఏమన్నారంటే
Next Article శ్రీ తేజ కుటుంబాన్ని పరామర్శించిన సుకుమార్..!
