పెనమలూరు నియోజకవర్గం, గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ళలో రైతుల సమస్యల పరిష్కారానికి నేరుగా సీఎం రంగంలోకి దిగారు. గంగూరులో రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి, ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేసారు. సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అన్నారు. తేమశాతం నిర్ధరణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుండి తానే అభిప్రాయాలు సేకరిస్తానని అన్నారు. రైతులకు ఐవీఆర్ఎస్ పై స్వయంగా అవగాహన కల్పించారు. దాని ద్వారా ఫీడ్ బ్యాక్ పంపాలని సూచించారు. రైతులకు సేవ చేసే విషయంలో అభివృద్ధి కనిపించాలని అధికారులకు సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Previous Article‘స్టార్‌బక్స్’ నిష్క్రమించడం లేదు:- టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్
Next Article ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త తెలిపిన ప్రపంచ బ్యాంక్…!