నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ పదవికి తన పేరును పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తల పట్ల సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ స్పందించారు. ఈవార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ఆయన గత నెల 10న పదవీవిరమణ చేసిన విషయం తెలిసిందే. ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ ను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, రాజ్యసభ డిప్యూటీ స్పీకర్,ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉంటారు.ఇటీవలే వీరు సమావేశమయ్యారు. ఎన్.హెచ్.ఆర్.సీ పదవికి మాములుగా మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటారు. వీరి పేర్లను ఎంపిక కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు చేసిన అనంతరం నియమింపబడతారు. జస్టిస్ మిశ్రా ఇదివరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీవిరమణ తరువాత తాత్కాలిక ఛైర్ పర్సన్ గా ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యురాలు విజయభారతీ సయానీ కొనసాగుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు