అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు బాలీవుడ్ నటుడు సోనూసూద్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన అరుంధతి విషయాలు గుర్తు చేసుకున్నారు.ఆ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు.’ నా కెరీర్ లో ఎప్పటికిగుర్తుందేది అరుంధతి’లోని పశుపతి.మేకప్ కు ఆరేడు గంటల టైం పట్టేది.మేకప్ వల్ల దద్దుర్లు వచ్చాయి.పగలు, రాత్రి నిరంతరాయంగా చిత్రీకరణ జరిగింది.షూటింగ్ మొత్తం పూర్తయ డైరెక్టర్ నుండి ఎప్పుడు ఫోన్ కాల్ వచ్చినా మళ్లీ యాక్ట్ చేయమంటారేమోనని భయపడేవాడిని.సినిమా విడుదల తర్వాత ముంబయి నుండి మళ్లీ హైదరాబాద్ వెళ్ళా…థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ చూసి ఆశ్చర్యపోయా.సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అప్పుడర్థమైంది.అదంతా జరిగి అప్పుడే 15 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా” అని పేర్కొన్నారు.
Previous Articleఒబామా మెచ్చిన భారతీయ చిత్రమిదే..!
Next Article ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు