అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకు వచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఒక మహాత్ముడు నడిచిన నేల ఇది. గిరిజన ప్రజలకు అండగా ఉన్న మహానుభావుడి పేరు పెట్టిన నేల, ఆయన పోరాడిన నేల, ఈ నేల డోలి రహిత గ్రామాలుగా ఉండాలని అన్నారు. 6 నెలల క్రితం యువత బలంగా మార్పు రావాలని అనుకున్నారు. మార్పు వచ్చింది మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది పంచాయితీ సర్పంచ్ లకు విలువ లేని పరిస్థితుల్లో ఈరోజు తల ఎత్తుకుని మేము సర్పంచులం అని చెప్పుకునే స్థాయిలో మేము పెట్టామని పవన్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే..ఇక్కడున్న సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టేనని అన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భరోసానిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహాకరించిన సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు