ఈ రోజు, ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా, ధ్యానాన్ని వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని మరియు దాని పరివర్తన సామర్థ్యాన్ని అనుభూతి పొందాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరి జీవితానికి, అలాగే మన సమాజానికి శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి ధ్యానం ఒక శక్తివంతమైన మార్గం. సాంకేతికత యుగంలో, యాప్‌లు మరియు గైడెడ్ వీడియోలు మన నిత్యకృత్యాలలో ధ్యానాన్ని చేర్చడంలో సహాయపడే విలువైన సాధనాలని ఆయన పేర్కొన్నారు.
మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరు ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ధ్యానం ప్రాధాన్యతను తెలియచెప్పేందుకు ఐక్య రాజ్యసమితి డిసెంబర్ 21ని ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు