అండర్-19 మహిళల ఆసియా కప్ లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచారు. తాజాగా జరిగిన ఫైనల్ లో 41 పరుగులతో బంగ్లాదేశ్ పై విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. త్రిష 52(47; 5×4,2×6) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. మిథిలా (17),నిక్కీ (12), ఆయుషీ(10) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా 4 వికెట్లు, నిశ్చిత 2 వికెట్లు తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ ఘోరంగా విఫలమైంది. 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఆయుషీ 3 వికెట్లు, పర్ణిక 2 వికెట్లు, సోనమ్ 2 వికెట్లు పడగొట్టారు. అర్థ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన త్రిష “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు