TG: ఏటా దీపావళి పండుగకు HYDలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ఈ నాణేలను తయారు చేస్తారు. ఈసారి గురువారం ప్రారంభమైన కాయిన్స్ పంపిణీ రేపటి(ఆదివారం) వరకూ కొనసాగనుంది. ఈ నాణేలు లభిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. రేపు సెలవు కావడంతో భక్తులు భారీగా వచ్చే అవకాశముంది.
Previous Articleఉద్యోగి ఆత్మహత్యపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Next Article రామభద్రపురంలో దంపతులపై దాడి.. బంగారం చోరీ