నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సిద్ధమయ్యాయి.అయితే అన్ని దేశాలకు అంటే ముందుగా,పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి.భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలకు కిరిబాటి ప్రజలు 2025లోకి అడుగుపెట్టారు.
కిరిబాటి దీవులు
కిరిబాటి దీవులు భూమి గ్రీన్విచ్ టైమ్‌లైన్‌కు అత్యంత దగ్గరగా ఉన్నాయి.ఈ దీవుల్లోని కార్బెలిన్ ప్రాంతం కొత్త సంవత్సరానికి ప్రపంచంలో మొదట స్వాగతం పలికే ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది.కిరిబాటి తర్వాత గంట వ్యవధిలోనే దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోని టోంగా మరియు సమోవా దీవులు కొత్త సంవత్సర వేడుకలను జరుపుకొనున్నాయి.
అనంతరం న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,జపాన్,దక్షిణ కొరియాలు ప్రపంచంతో పాటు వేడుకలను జరుపుకోనున్నాయి.న్యూజిలాండ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కి 2025కి స్వాగతం పలకనుంది.ఆస్ట్రేలియా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటల సమయంలో న్యూ ఇయర్ కు స్వాగతం పలకనుంది.జపాన్ మరియు ఉభయ కొరియాలు వేడుకలతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించనున్నాయి.