ఏడాది చివరి రోజును దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగించాయి. నష్టాలతో నేడు ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు ఆద్యంతం నష్టాలలోనే పయనించాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 109 పాయింట్ల నష్టంతో 78,139 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా ట్రేడింగ్ ముగించింది. 0.10 పాయింట్లు నష్టపోయి 23,644 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.65గా కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్ లో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐటీసీ, అల్ట్రా టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleప్రపంచంలో ముందుగా న్యూ ఇయర్ జరుపుకునే దేశం ఏది అంటే?
Next Article ‘కేకియస్ మాక్సిమస్’గా ఎలాన్ మస్క్