డీ విటమిన్ లోపం వల్ల నీరసం…ఎముకలు బలహీనంగా మారడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని అందరికి తెలుసు.అయితే దీని లోపం వల్ల మహిళల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు.తీవ్ర నీరసం…నిద్రపట్టకపోవడంతోపాటు మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలిపారు. విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోవడం కూడా ఈ విటమిన్ లోపమే.మెదడులో విటమిన్ డి గ్రాహకాలుంటాయి.ఇవి మూడ్‌ను ప్రభావితం చేసే సెరటోనిన్ వంటి రసాయనాల మీదా ప్రభావం చూపుతాయి.
అకారణంగా జుట్టు రాలటం కూడా విటమిన్ దీనికి సంకేతం కావొచ్చు.చాలాసార్లు హార్మోన్ మార్పులు, ఒత్తిడితో వెంట్రుకలు ఊడుతున్నాయని అనుకుంటుంటారు.కానీ విటమిన్ డి లోపిస్తే వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి.విటమిన్ డి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.ఇది లోపిస్తే అండాశయ సమస్యలు తలెత్తుతాయి.సంతానం కలగటంలో ఇబ్బంది కలిగిస్తాయి.ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తికీ విటమిన్ డి తోడ్పడుతుంది.కండరాల నొప్పి,బలహీనత కూడా విటమిన్ డి లోపానికి చిహ్నం కావొచ్చు.కాబట్టి,డి విటమిన్ లోపించినట్లు అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.దానిని మెరుగు పరచుకోవడానికి శరీరానికి సూర్య రశ్మి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.వైద్యులు సూచించిన మందులు వాడాలి.