గ్యాంగ్‌స్టర్లకు ఢిల్లీ రాజధానిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆతిశీ అన్నారు.ఇటీవల హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించారుఆ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.దిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.సుందర్ నగరీలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను వేధిస్తుండగా..ఆమె కుటుంబీకులు,బంధువులు వారిని మందలించారు.అనంతరం ఆ ఇద్దరు కత్తులతో చేసిన దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Previous Articleమహిళల్లో డీ విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించవచ్చు..?
Next Article మూడోసారి టైటిల్ విజేతగా భారత్