రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. అందువలోనూ ముడి తేనె అయితే మేలు అని నిపునులు అంటున్నారు.క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా తేనెలో ఉంటాయి.ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె,సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్ధకం,ఛాతీ మంట తగ్గుతాయి.ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె,నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. చెంచా తేనెకి…చెంచా నిమ్మరసం కలిపి తీసుకుంటే జలుబు,దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక కప్పు హెర్బల్‌టీకి ఒక చెంచా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి చక్కని డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.పంటిసమస్యల నుంచీ ఉపశమనం కలుగుతుంది.రెండు చెంచాల యాపిల్‌సిడార్ వెనిగర్‌కి ఒక చెంచా చొప్పున తేనె కలిపి తాగితే… సైనస్ అదుపులో ఉంటుందని పలు అధ్యనాల్లో తేలింది.అంతే కాకుండా పెదవుల అందానికి కూడా తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది.ఒక స్పూన్ తేనెలో కొద్దిగా పంచదార కలుపుకుని పెదవులకి రాస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి మృదువుగా అవుతాయి.