‘మర్డర్’తో గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్.తాజాగా ఆమె తన రిలేషన్ షిప్ స్టేటప్‌పై స్పందించారు.తాను సింగిల్‌గానే ఉన్నానని చెప్పారు.తన ప్రియుడు సిరిల్ ఆక్సెన్‌ఫాన్స్‌తో బ్రేకప్ అయిందన్నారు.‘‘పెళ్లిపై నేను వ్యతిరేకం కాదు.అలా అని అందుకు సిద్ధంగానూ లేను.ప్రస్తుతం ఉన్న రోజుల్లో సరైన వ్యక్తిని ఎంచుకోవడం ఎంతో క్లిష్టమైన విషయం’’ అని చెప్పారు.బ్రేకప్ గురించి తాను చెప్పాలనుకోవడం లేదన్నారు.సింగిల్‌గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు.
Previous Articleఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ
Next Article మీ రోగనిరోధకశక్తి బలోపేతం అవ్వాలి అంటే ?