టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా మంచి పేరు సొంతం చేసుకున్నారు నటీనటులు రష్మిక – విజయ్ దేవరకొండ. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించినప్పటి నుంచి ఈ జంట గురించి ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సినీ ప్రియులు మాత్రమే కాకుండా బీటౌన్‌లో తారలు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా కథనాల్లో నిజం లేదని ఈ జంట పలుమార్లు చెప్పినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా వీరిద్దరూ ముంబయి ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. మొదట ఎయిర్‌పోర్టుకు వచ్చిన రష్మిక ఫొటోగ్రాఫర్లకు నవ్వుకుంటూ పోజులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటికి విజయ్ దేవరకొండ ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టారు. దీంతో ఈ జంట మరోసారి వార్తలోకి ఎక్కింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగానే వీరిద్దరూ విదేశాలకు వెళ్తున్నారని .. ఈ జంట కలిసి సెలబ్రేట్ చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబయి ఎయిర్ పోర్టు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Previous Articleకోహ్లీ నన్ను బ్లాక్ చేశాడు: బిగ్‌బాస్ నటుడు
Next Article విడుదలైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్

