క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్ వచ్చేసింది. 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లకు మినహా పాకిస్థాన్ ఈ సిరీస్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ లో తటస్థ వేదికలపై జరగనున్నాయి.
గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా… గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ లు ఉన్నాయి. భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మార్చి 2న న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది.
Check out the full fixtures for the ICC Champions Trophy 2025. pic.twitter.com/oecuikydca
— ICC (@ICC) December 24, 2024

