నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’.అయితే ఈ చిత్రం ‘హిట్’ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రమిది.ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.నిన్న క్రిస్మస్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో నాని స్టెలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు.కశ్మీర్ షెడ్యూల్‌లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నామని, ఇవి సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది.వచ్చే సంవత్సరం మే 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నాడు.
Merry Christmas to each one of you
🎁 #HIT3 pic.twitter.com/WO2VmdvofX— Nani (@NameisNani) December 25, 2024