విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి నాగ వంశీ తాజాగా మాట్లాడారు.దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.విజయ్ దేవరకొండ సినిమా మార్చి 28 విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు.ఒకవేళ ఆ సమయంలో ‘హరిహరవీరమల్లు’ విడుదలైతే ఇది వాయిదా పడుతుంది.ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.
అయితే ఇది రెండు పార్టులుగా వస్తుంది. రెండు కథలు విడివిడిగానే ఉంటాయి.దీన్ని ప్రారంభించినప్పుడు ఒక భాగమే అనుకున్నాం…కానీ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నప్పుడు రెండో పార్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.అల్లు అర్జున్ కొంచెం ఫ్రీ అయిన తర్వాత చర్చించుకొని ముందుకువెళ్తామని చెప్పారు. ఏప్రిల్ లేదా మే లో షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నామని ఆయన అన్నారు.