సంధ్య థియేటర్ ఘటనను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు.హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళ తీరును ఆయన తప్పుబట్టారు.చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా ఒకానొక సమయంలో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లేవారని…ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు పటించేవారని అన్నారు.”ఇటీవల జరిగిన పరిస్థితులు చూస్తే బయట ఉన్నవాళ్లకు కూడా ఒక స్పష్టత వస్తుంది.సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు.దానికి అనుగుణంగా హీరోలు వ్యవహరిస్తున్నారు.ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లాలి.రోడ్ షో చేయాలని భావిస్తున్నారు.
ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యాయి.అలా చేయకుండా సైలెంట్ గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు.అప్పటి హీరోలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడాలనుకుంటే మల్టీ ఫ్లెక్స్ కు వెళ్ళేవారు.ఒకవేళ సింగిల్ స్క్రీన్ కు వెళ్ళాలని ఉన్నా… ఎవరికి చెప్పకుండా వెళ్లి వచ్చేసేవారు.ఇప్పుడు అలా కాదు…అభిమాన హీరో వస్తున్నాడని ముందే సందేశాలు పంపిస్తున్నాను.దాని వల్ల అభిమానులు ఎక్కువ కావడం.. సమస్యలు తలెత్తడం జరుగుతుందని తమ్మారెడ్డి అన్నారు