రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్రం సీక్వెల్ త్వరలో పట్టాలు ఎక్కనుంది అని సమాచారం.దీపికా పదుకొణె షూట్‌లో పాల్గొననున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై దీపిక తాజాగా స్పందించారు. ఆయా కథనాల్లో నిజం లేదని పరోక్షంగా తెలిపారు.
ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత కుమార్తె దువా అన్నారు పాప సంరక్షణను పక్కన పెట్టేసి వెంటనే వర్క్ లైఫ్‌లో బిజీ కావాలనుకోవడం లేదన్నారు.‘‘నా కుమార్తెను నేనే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను అని చెప్పారు.మా అమ్మ నన్ను ఎలా అయితే చూసుకున్నారో అదే విధంగా నా పాపను నేను చూసుకోవాలనుకుంటున్నాను….తన ప్రతిక్షణాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నా’’ అని ఆమె తెలిపారు.