శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఆవరణలో డిసెంబర్ 19న ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి,ముకేశ్ రాజ్‌పూత్ గాయపడిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒకరైన ప్రతాప్‌చంద్ర సారంగి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారని అలాంటి పదవిలో కొనసాగుతున్న రాహుల్ ఈవిధంగా ప్రవర్తించడం సరైనది కాదని అన్నారు.దాదాపు 10 రోజులు తాను ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందన్నారు. తోపులాట కారణంగా తలపై కుట్లు పడ్డాయని అవి ఇంకా మానలేదని తెలిపారు.
పార్లమెంట్‌లో తోపులాట…రాహుల్ గాంధీ బౌన్సర్‌లా వ్యవహరించారు: బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి
By admin1 Min Read
Previous Articleఆ కథనాల్లో నిజం లేదు :- దీపిక పదుకొణె
Next Article ఆంజనేయస్వామికి లక్ష వడమాల…!