సమంతకు నటి కీర్తి సురేశ్ థాంక్స్. సామ్ వల్లే తనకు బేబీ జాన్‌లో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని అన్నారు.‘‘తెరీ’ సినిమా హిందీలో రీమేక్ చేయాలని చిత్రబృందం భావించగా కథానాయికగా నేను అయితే న్యాయం చేయగలనని సమంత భావించారు.చిత్రబృందానికి నా పేరు సూచించారు.తమిళంలో ఆమె పోషించిన పాత్రను హిందీలో నేను చేయడం ఆనందంగా ఉంది.ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.ఈ విషయంలో సమంతకు కృతజ్ఞతలు.
‘తెరీ’లో సమంత నటన నాకెంతో ఇష్టం.రీమేక్ విషయంలో ఆమె నాకెంతో సపోర్ట్ ఇచ్చారు.చిత్రబృందం నా పేరు వెల్లడించగానే ‘నువ్వు తప్ప ఈ పాత్రను మరెవ్వరూ చేయలేరు’ అని తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు.ఆ సందేశం నాలో నమ్మకాన్ని పెంచింది.ఉత్సాహంగా దీని షూటింగ్‌లో పాల్గొన్నా. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే చిత్రీకరణ పూర్తి చేశా అని కీర్తి వివరించారు.

