సోషల్‌మీడియా వేదికగా తాను వేధింపులు ఎదుర్కొంటున్నానని నటి హనీరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దీంతో సోమవారం ఉదయం ఎర్నాకులం పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు.అందులో కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.‘‘వివరణాత్మక విమర్శలు, నా లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను నేనూ స్వాగతిస్తా.వాటిని పెద్దగా పట్టించుకోను.కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుందని నేను నమ్ముతున్నా.అసభ్యకరంగా చేసే కామెంట్స్‌ను ఏమాత్రం సహించను.అలాంటి కామెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని తాజాగా ఆమె పోస్ట్ పెట్టారు.
Previous Articleపశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన: పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
Next Article భారత్‌లో రెండు చైనా వైరస్ కేసులు…!