ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. ఉండి హైస్కూలులో ఆధునికీకరించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో సంభాషించారు. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. డ్రగ్స్ వైపు అసలు వెళ్ళకండి. మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్. బాగా చదువుకోండి. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మీరు బాగా చదివితే, మీ కుటుంబం కూడా బాగుపడుతుందని పేర్కొన్నారు. నా అజెండా ఒక్కటే, వచ్చే 5 ఏళ్ళలో ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు మార్చేయాలని… మీరు బాగా చదువుకోవాలి అనేదే నా కోరికని లోకేష్ స్పష్టం చేశారు. అంతకుముందు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీఐఐసీ చైర్మన్ శివరామరాజు, టీడీపీ స్థానిక నేతలు మంత్రి లోకేష్ కు ఉండిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం 108 ఏళ్ల చరిత్ర ఉన్న జడ్పీ హైస్కూలును లోకేష్ సందర్శించారు.
స్కూలు ఆవరణలో ఆధునికీకరించిన భవనాలను ప్రారంభించి, స్కూలులో సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. హైస్కూల్ నుంచి రూ.18 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఇక ఉండి నియోజకవర్గంలో పెద అమిరం గ్రామంలో దివంగత శ్రీ రతన్ టాటా విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. రతన్ టాటా గారు ఒక గొప్ప మనిషి.
నాడు బసవతారకం హాస్పిటల్ కు విరాళం ఇచ్చిన దగ్గర నుంచి, ఆయన చనిపోయే ముందు కూడా విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే దాకా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేసారని కొనియాడారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన: పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
By admin1 Min Read
Previous Articleఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం:రూ.5 లక్షల ఆర్థిక సాయం: డిప్యూటీ సీఎం పవన్
Next Article హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు…!

