97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ మరో 2 నెలల్లో జరగనుంది.కాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది.వీటిలో 207 చిత్రాలు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయని తెలుస్తుంది.ఈ పోటీలో నిలిచిన వాటిలో 6 భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి.వాటిలో కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (హిందీ), సంతోష్ (హిందీ),స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ (మలయాళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్ (హిందీ-ఇంగ్లిష్) చిత్రాలు భారత్ నుండి ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచాయి.
అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన కంగువా ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు సినీ విమర్శకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ల కోసం ఓటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది.అయితే జనవరి 12న ఈ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది.అకాడమీ తుది నామినేషన్‌లను జనవరి 17న వెల్లడిస్తుంది.ఈ 5 సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఆస్కార్ 2025 వేడుక 2025 మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించనున్నారు.