1998లో విడుదలై భారతీయ గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో మాస్టర్ పీస్ గా నిలిచింది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ చిత్రం. సత్యగా జేడీ చక్రవర్తి, బికూ మాత్రేగా మనోజ్ బాజ్ పాయ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఊర్మిళ, పరేష్ రావల్, సౌరభ్ శుక్లా, షెఫాలీ షా, ఆదిత్య శ్రీ వాత్సవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ముంబై అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈచిత్రం సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపించింది. ఇక 27 సంవత్సరాల తరువాత ఈచిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈనెల 17న ప్రేక్షకులను మరోసారి అలరించనుంది. ఈమేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Previous Articleసుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, ఏపీఎస్ఎస్డీసీ మధ్య ఒప్పందం
Next Article ఆస్కార్ -2025 అవార్డు బరిలో 6 భారతీయ చిత్రాలు…!