హీరో విశాల్ ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.‘విశాల్‌కు డిల్లీలో ఉన్నప్పుడే ఫీవర్ వచ్చింది.ఆ విషయం ఎవరికీ తెలియదు.కానీ ‘మదగజరాజ’ సినిమా 11 ఏళ్ల తర్వాత విడుదల అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్‌కు వచ్చారు.ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నారు.జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగాను.11 ఏళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకువస్తోంది.దీనికి కచ్చితంగా రావాలనుకున్నాను’ అని చెప్పారు.103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు.ఆ ఈవెంట్ పూర్తికాగానే మేం విశాల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు కోలుకుంటున్నారు.ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు.కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారు.సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తున్నారు.‘మదగజరాజ’ కోసం విశాల్ ఎంతో కష్టపడ్డాడు’ అని తెలిపారు.మదగజ రాజ చిత్రానికి ఖుష్బూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు.దాదాపు 12 క్రితమే దీనిని రూపొందించారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు