ఈనెల 14న ఢిల్లీ లో ప్రారంభంకానున్న ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీ.వీ.సింధు, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు. ఒలింపిక్ ఛాంపియన్లు సహా అగ్రశ్రేణి క్రీడాకారులు ఇండియా ఓపెన్ బరిలో దిగుతున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. భారత్ నుండి ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, సాయి ప్రతీక్-పృథ్వీ, మహిళల డబుల్స్ లో అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో, గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ, రుతుపర్ణ పాండా-శ్వేత పర్ణ పాండా, అశ్విని భట్, శిఖా గౌతమ్, మానస రావత్-గాయత్రీ రావత్, సాక్షి గహ్లావత్- అపూర్వ గహ్లావత్, సానియా సికందర్- రష్మి గణేశ్, మృణ్మయీ దేశ్ పాండే- ప్రేరణ ఆల్వేకర్, ఇక మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో, సతీశ్కుమార్- ఆద్య వరియత్, రోహన్ కపూర్- రుత్విక శివాని, ఆషిత్ సూర్య- అమృత ప్రముతేష్ తదితర భారత షట్లర్లు బరిలోకి దిగనున్నారు.
Previous Articleహీరో విశాల్ ఆరోగ్యంపై ఖుష్బూ క్లారిటీ
Next Article సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన నిహారిక…!