కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “రెట్రో”.సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన భార్య జ్యోతికతో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు.ఇందులో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తుంది.ఈ సినిమా విడుదల డేట్ ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది.మే 1 తేదిన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలుస్తుంది.యాక్షన్,ప్రేమ, గాఢమైన భావోద్వేగాల మేళవింపుగా రూపొందుతున్న కథ.గ్యాంగ్ స్టార్ పాత్రలో సూర్య కనిపించనున్నారని సమాచారం.కథానాయకుడు తాను ప్రయాణం చేస్తున్న హింస మార్గం నుండి బయటకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని తన ప్రేయసికి చెప్పే సన్నివేశాలు ఇటీవల విడుదలైన టీజర్లో కనిపించాయి.జయరామ్,కరుణాకరన్,జోజు జార్జ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Previous Articleడాకుమహారాజ్ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేష్
Next Article ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటించలేదు