నట సింహం నందమూరి బాలకృష్ణ కథానయకుడిగా బాబీ దర్శకత్వం వహించిన చిత్రం ‘డాకు మహారాజ్’.ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మించారు.సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.రేపు సాయంత్రం అనంతపురంలో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ దీనికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం.
Previous Articleప్రధాని మోడీ నాయకత్వంలో దేశం దూసుకెళ్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article సూర్య “రెట్రో” విడుదల ఎప్పుడంటే..?