రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’.ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆసక్తికర పోస్ట్ పెట్టారు.‘గేమ్ ఛేంజర్’ చిత్రంపై పలు వెబ్‌సైట్స్ రాసిన రివ్యూలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఆమె చరణ్‌కు కంగ్రాట్స్ చెప్పారు.‘‘కంగ్రాట్స్ డియర్ హస్బెండ్.ప్రతి విషయంలో నువ్వు నిజంగానే ఒక గేమ్ ఛేంజర్. లవ్ యూ’’ అని పేర్కొన్నారు. హార్ట్ సింబల్స్‌ను జత చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘గేమ్ ఛేంజర్’ రూపుదిద్దుకుంది.దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో దిల్ రాజు దీనిని నిర్మించారు.అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించారు.శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.ఇందులో ‘నానా హైరానా’ పాటను ప్రస్తుతానికి తొలగించినట్లు టీమ్ తెలిపింది.సాంకేతిక కారణాల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.జనవరి 14 నుంచి ఈ పాట జోడిస్తామని వెల్లడించింది.

