నటి నిధి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.తన కెరీర్ గురించి మాట్లాడారు.2022లో విడుదలైన ‘హీరో’ తర్వాత దాదాపు మూడేళ్లపాటు కెరీర్‌లో గ్యాప్ రావడంపై ఆమె మాట్లాడారు.ఈ ఏడాదిలో రానున్న రెండు సినిమాలపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంతకం చేశా.ఆ సమయంలో కెరీర్ పరంగా ఎలాంటి గ్యాప్ లేదు.చిత్రీకరణ సమయంలో దాదాపు మూడున్నర సంవత్సరాలు గడిచి పోయింది. వేరే చిత్రాలకు సంతకం చేయొద్దని టీమ్ నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.‘రాజాసాబ్’లో అవకాశం వచ్చినప్పుడు ‘హరి హర వీరమల్లు’ టీమ్‌ను సంప్రదించా.అందులో భాగం కావాలనుకుంటున్నానని చెప్పా.వాళ్లు దానికి అంగీకరించారు.ఈ రెండింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నా.కెరీర్ గురించి ఆలోచించి బాధ పడిన సందర్భాలు ఉన్నాయి.ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో యాడ్స్ చేస్తున్నా. ’’ అని నిధి అగర్వాల్ తెలిపారు.పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ‘హరిహర వీరమల్లు’ సిద్ధమవుతోంది.క్రిష్,జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది.రెండు భాగాల్లో ఈ సినిమా విడుదల కానుంది.తొలి భాగం మార్చి 28న విడుదల కానుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

