శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇండియన్2’.దీనికి కొనసాగింపుగా ‘ఇండియన్ 3’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇకపై తన ఫోకస్ మొత్తం ఆ సినిమాపైనే ఉంటుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.మరో ఆరు నెలల్లో ‘ఇండియన్ 3’ పనులు పూర్తి అవుతాయి.ఆ సినిమాకు సంబంధించిన భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి.కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది’’ అని శంకర్ తెలిపారు. 1996లో విడుదలైన ‘భారతీయుడు’కు సీక్వెల్స్‌గా రెండు, మూడు భాగాలు తెరకెక్కాయి.రెండో పార్ట్‌లో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ఎస్జే సూర్య,బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు.సమాజంలోని అవినీతి, అన్యాయాల్ని రూపుమాపడానికి సేనాపతి ఏం చేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.మేకింగ్‌పరంగా సినిమా ఉన్నతంగా ఉన్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉన్నందున అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
Previous Articleసైఫ్‌పై దాడి చిరంజీవి ఏమన్నారంటే
Next Article మీరే నిజమైన హీరోలు..: ప్రియాంకా చోప్రా…!

