అమెరికాలోని లాస్ ఏంజలెస్ కార్చిచ్చు ఇంకా ఆగలేదు.తాజాగా ఈ కార్చిచ్చు సంక్షోభంపై నటి ప్రియాంకా చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.మంటలకు ఆహుతైన భవనాలను,అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ…మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘హృదయం భారంగా ఉంది.నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను.ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాను.స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు.ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం.ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు.మీరే నిజమైన హీరోలు’ అని ప్రియాంక పేర్కొన్నారు.
Previous Articleకమల్ హాసన్ సినిమాపైనే నా ఫోకస్
Next Article చంద్రగిరి పోలీసులకు మనోజ్ ఫిర్యాదు