విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.ప్రస్తుతం విశ్వక్, రామ్ నారాయణ్ కాంబోలో ‘లైలా’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.అయితే ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఫిబ్రవరి వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ‘లైలా’ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను రెట్టింపు చేస్తున్నారు.తాజాగా సంక్రాంతి సందర్భంగా ‘లైలా’ నుంచి డబుల్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 17న టీజర్ విడుదల కానుందని తెలిపారు.విశ్వక్ అమ్మాయి గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.ఇందులో ఆయన అచ్చం అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.