తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై జరుగుతోన్న ఐటీ సోదాలను ఉద్దేశించి దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన దీని గురించి మాట్లాడారు. మీ నిర్మాత దిల్‌రాజు ఐటీ రైడ్స్ బాధలో ఉంటే మీరు సక్సెస్ మీట్ చేసుకుంటున్నారని ఓ జర్నలిస్ట్ సరదాగా వేసిన ప్రశ్నకు అనిల్ సమాధానిమిచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టాం కదా. అందుకే వాళ్లు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో.దిల్‌రాజు బాధలో లేరు.ఆయన ఒక్కడిపైనే రైడ్స్ జరగడం లేదు.ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.ఇదంతా ఒక ప్రాసెస్‌లో భాగమే.ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయి.ఇండస్ట్రీ, బిజినెస్ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం.నేను వచ్చినా రాకపోయినా…ఈ సినిమా ప్రమోషన్‌ను ఆపొద్దు. ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండి’ అని దిల్ రాజు మాతో చెప్పారు. అందుకే ఈ సినిమా విజయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం’’ అని సమాధానం ఇచ్చారు.

