మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం కొచ్చిన్‌లో జరిగింది.ఇందులో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ చిత్ర నిర్మాణసంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ గురించి మాట్లాడారు. రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం తనకు వచ్చినప్పటికీ తాను చేయలేకపోయానని అన్నారు. అది తనకు గొప్ప అవకాశమే అయినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయానని తెలిపారు.
‘‘లైకా సంస్థ గతంలో నాకొక ఆఫర్ ఇచ్చింది. రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను డైరెక్ట్ చేయమని అడిగింది.దర్శకత్వంలో అప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నాలాంటి కొత్తవారికి అది నిజంగా గొప్ప అవకాశం.దానిని సద్వినియోగం చేసుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించా.నేను కేవలం పార్ట్ టైమ్ దర్శకుడిని మాత్రమే.వివిధ కారణాల వల్ల రజనీకాంత్ కోసం కథ సిద్ధం చేయలేకపోయా.ఆ ఆఫర్ కార్యరూపం దాల్చనప్పటికీ లైకాతో నా అనుబంధం కొనసాగింది.ఆ బ్యానర్‌పై హీరోగా ఒక సినిమా చేయడానికి అంగీకరించా. భారీ చిత్రంగా అది రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ చదివాను. నాకెంతో నచ్చింది’’ అని తెలిపారు. అనంతరం ఆయన టీజర్ గురించి మాట్లాడారు. ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలను కేవలం టీజర్ కోసమే షూట్ చేసినట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన అసలైన ఫుటేజ్‌ను ప్రోమోల్లో చూపించడం తనకు ఇష్టం ఉండదని అందుకే తాను ఈవిధంగా చేశానని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు