ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ , మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.2014లో వీరంతా తనను ఓ హనీ ట్రాఫ్ కేసులో ఇరికించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ విధుల నుంచి తొలగించారని మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాలతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఫిర్యాదులో ఆయన తాను కులపరమైన దూషణలు, బెదిరింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు.2014లో గోపాలకృష్ణన్,బలరాం మొదలైనవారు హనీ ట్రాప్ చేసి తప్పుడు కేసులో ఇరికించారని వీరికి ఇతర ఫ్యాకల్టీ సభ్యులు సహకరించారన్నారు. కాగా గోపాలకృష్ణన్ ఈవిషయంపై స్పందించాల్సి ఉంది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడి సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ,ఎస్టీ కేసు
By admin1 Min Read